Viral Video: పేరుకే వృద్ధుడు.. ఇతడి విన్యాసాలు చూశారంటే.. ఖంగుతింటారు..

ABN , First Publish Date - 2022-11-30T19:59:31+05:30 IST

కొందరు వయసుతో సంబంధం లేకుండా వినూత్నమైన పనులు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి విచిత్రమైన..

Viral Video: పేరుకే వృద్ధుడు.. ఇతడి విన్యాసాలు చూశారంటే.. ఖంగుతింటారు..

కొందరు వయసుతో సంబంధం లేకుండా వినూత్నమైన పనులు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి విచిత్రమైన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు సైకిల్‌పై చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈయన పేరుకే వృద్ధుడు.. ప్రతిభలో మాత్రం నవ యువకుడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పబ్లిక్ ప్లేస్‌లో యువతుల ఫైటింగ్.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజనం..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. వర్షం పడుతుండగా.. ఓ వృద్ధుడు (old man) సైకిల్‌పై రోడ్డు పైకి దూసుకొస్తాడు. ఆ వయసులో ఉన్న వారు నడవడానికే ఇబ్బంది పడుతుంటే.. ఈ వృద్ధుడు మాత్రం యువకులకు తానేమీ తీసిపోనంటూ నిరూపిస్తాడు. సైకిల్ హ్యాండిల్‌ని వదిలేసి, రెండు చేతులూ చాపి వేగంగా ముందుకు వెళ్తాడు. తర్వాత కాళ్లు రెండు ముందు వైపు పెట్టి నడుపుతాడు. ఇలా ఓ వైపు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు సైకిల్‌పై విన్యాసాలు (Bicycle stunts) చేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జీవితంలో ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది.. అంటూ కొందరు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ మరికొందరు, పెద్దాయన టాలెంట్ సూపర్.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఏటీఎం మిషన్‌కి జిగురు పూసి మరీ.. వీళ్లు చేసిన చోరీ తెలిస్తే.. అవాక్కవుతారు..

Updated Date - 2022-11-30T20:00:56+05:30 IST