మూడేళ్ల కూతురు అదృశ్యం.. పొలాల్లో దొరికిన మృతదేహం.. అత్యాచారం చేసి చంపేసినా రెండేళ్లుగా కదలని కేసు..!

ABN , First Publish Date - 2022-11-30T17:15:30+05:30 IST

ఏళ్లు గడుస్తున్నా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉంటాయి. ఇంకొన్ని కేసులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంటాయి. యూపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఇలాంటి ఓ కేసు.. ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. .

మూడేళ్ల కూతురు అదృశ్యం.. పొలాల్లో దొరికిన మృతదేహం.. అత్యాచారం చేసి చంపేసినా రెండేళ్లుగా కదలని కేసు..!

ఏళ్లు గడుస్తున్నా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉంటాయి. ఇంకొన్ని కేసులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంటాయి. యూపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఇలాంటి ఓ కేసు.. ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. రెండేళ్ల క్రితం మూడేళ్ల చిన్నారి అదృశ్యమైంది. అయితే మరుసటి రోజు పొలాల్లో శవమై కనిపించింది. ఎవరో అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. వివరాల్లోకి వెళితే..

చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు.. కాలితో నోరును నొక్కి.. కర్రలతో చితకబాది..

యూపీలోని (UP) లఖింపూర్ జిల్లా పరిధి మథియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక.. 2020 సెప్టెంబర్‌లో (girl Missing) తప్పిపోయింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు.. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. మరుసటి రోజు గ్రామానికి సమీపంలోని పొలంలో బాలిక శవమై కనిపించింది. ఎవరో బాలికపై అత్యాచారం చేసి, గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెప్టెంబర్ 5న నిందితుడు లేఖరామ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన జరిగి రెండేళ్లకు పైగా అవుతున్నా.. ఇంత వరకు కోర్టులో ఒక్క వాంగ్మూలం కూడా సమర్పించలేదు. ఇదిలావుండగా, తమ తరపు వాదించేందుకు నియమించిన ప్రభుత్వ న్యాయవాది (Government Advocate).. తమకు కోర్టు వాయిదాల గురించి సమాచారం అందించడం లేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

రాత్రి వేళ ఇంటికి వచ్చిన.. భర్త బంధువులకు మర్యాదలు చేసిన భార్య.. కుశలు ప్రశ్నలు వేస్తూనే ఉన్నట్టుండి..

ఒక వేళ కోర్టుకు (Court) వెళ్లినా రోజంతా అక్కడే కూర్చోబెట్టి, ఎలాంటి సంతకాలు తీసుకోకుండా పంపించేవారని చెబుతున్నారు. దీనిపై న్యాయవాది మాట్లాడుతూ.. బాధిత కుటుంబీకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ కేసులో బాలిక తాత, తండ్రి, మరో ఇద్దరు స్థానికులు.. సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 30సార్లు పిలిచినా ఎవరూ కోర్టుకు సక్రమంగా హాజరుకాలేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో కొన్ని సార్లు వారికి కోర్టు జరిమానా కూడా విధించిదని గుర్తు చేశారు. మరోవైపు కొందరు స్థానికులు మాట్లాడుతూ.. బాలిక హత్య కేసులో లేఖరామ్‌ను కావాలనే ఇరికించారని చెబుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు, లేఖరామ్‌కు పాత గొడవలు ఉన్నాయని, ఈ కోపంతోనే బాలిక హత్య కేసులో అతడి పేరు చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. యూపీలో ఇలాంటి పలు కేసులు.. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అపరిష్క్రుతంగానే ఉన్నాయి.

పెళ్లిలో డీజే పాటలకు అంతా డాన్సులు వేస్తుంటే.. ఫుల్‌గా మందు తాగిన యువకులు.. అర్ధరాత్రి చేసిన పనికి అంతా షాక్..

Updated Date - 2022-11-30T17:15:34+05:30 IST