పెళ్లిలో డీజే పాటలకు అంతా డాన్సులు వేస్తుంటే.. ఫుల్‌గా మందు తాగిన యువకులు.. అర్ధరాత్రి చేసిన పనికి అంతా షాక్..

ABN , First Publish Date - 2022-11-27T18:50:04+05:30 IST

వివాహ వేడుకలో విందులు, వినోదాలు, డాన్సులతో అంతా సరదాగా గడుపుతున్నారు. అదే సమయంలో ఫుల్‌గా మందు తాగి డీజే పాటలకు డాన్స్ చేస్తున్న ఇద్దరు యువకుల దృష్టి ..

పెళ్లిలో డీజే పాటలకు అంతా డాన్సులు వేస్తుంటే.. ఫుల్‌గా మందు తాగిన యువకులు.. అర్ధరాత్రి చేసిన పనికి అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

వివాహ వేడుకలో విందులు, వినోదాలు, డాన్సులతో అంతా సరదాగా గడుపుతున్నారు. అదే సమయంలో ఫుల్‌గా మందు తాగి డీజే పాటలకు డాన్స్ చేస్తున్న ఇద్దరు యువకుల దృష్టి ఓ బాలికపై పడింది. కాసేపటి తర్వాత ఆమె వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి నమ్మించారు. చివరకు బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారు చేసిన దారుణం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

క్లాస్ రూంలో టీచర్‌ను వీడియో తీసిన విద్యార్థులు.. దగ్గరికి వెళ్లి.. ఐ లవ్ యూ అని చెప్పి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలోని బంతర ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతంలో శనివారం రాత్రి ఓ వివాహం (marriage) జరిగింది. ఈ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీజే సాంగ్స్ (DJ songs) మధ్య యువతీయువకులంతా సందడి సందడిగా గడుపుతున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు యువకులు ఫుల్‌గా మందు తాగి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ బాలికపై వారి కన్ను పడింది. తర్వాత బాలికకు మాయ మాటలు చెప్పి మంటపానికి దూరంగా తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఆమె నోరు మూసి, బైకుపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బాలికపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డారు.

ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన మహిళలు.. జరిగింది తెలుసుకుని షాక్.. చివరకు డాక్టర్‌ని ప్రశ్నించగా..

అప్పటికే బాలిక కనిపించకపోవడంతో బంధువులు మంటపంలో వెతుకుతున్నారు. కాసేపటికి బాలిక కేకలు విని.. అటుగా పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇద్దరిలో ఓ యువకుని పట్టుకున్నారు. అయితే మరో వ్యక్తి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల (Medical tests) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పురనావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లి విషయం మాట్లాడాలంటూ కొడుకు ప్రియురాలిని పిలిచిన తండ్రి.. నేనున్నా అని హామీ ఇచ్చి.. ఊహించని విధంగా..

Updated Date - 2022-11-27T18:52:52+05:30 IST

Read more