రాత్రి వేళ ఇంటికి వచ్చిన.. భర్త బంధువులకు మర్యాదలు చేసిన భార్య.. కుశలు ప్రశ్నలు వేస్తూనే ఉన్నట్టుండి..

ABN , First Publish Date - 2022-11-27T21:03:23+05:30 IST

ప్రస్తుతం చాలా మందిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కొందరైతే మంచి, మర్యాదలు మరచి ప్రవర్తిస్తుంటారు. మహిళల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. కొందరు..

రాత్రి వేళ ఇంటికి వచ్చిన.. భర్త బంధువులకు మర్యాదలు చేసిన భార్య.. కుశలు ప్రశ్నలు వేస్తూనే ఉన్నట్టుండి..

ప్రస్తుతం చాలా మందిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కొందరైతే మంచి, మర్యాదలు మరచి ప్రవర్తిస్తుంటారు. మహిళల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. కొందరు కామాంధులు వయసు, వరుసలు మరచి దారుణాలకు పాల్పడుతుంటారు. రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాత్రి వేళ ఇంటికి వచ్చిన భర్త బంధువులకు ఆమె మర్యాదలు చేసింది. అయితే వారు మాత్రం ఆమెను వక్రదృష్టితో చూశారు. చివరకు వారు చేసిన దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సబంధించిన వివరాల్లోకి వెళితే...

క్లాస్ రూంలో టీచర్‌ను వీడియో తీసిన విద్యార్థులు.. దగ్గరికి వెళ్లి.. ఐ లవ్ యూ అని చెప్పి..

రాజస్థాన్ (Rajasthan) భరత్‌పూర్‌లోని బయానా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను జేసీబీ డ్రైవర్‌గా (JCB Driver) పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇదిలావుండగా, శుక్రవారం భర్త జేసీబీ పనికి వెళ్లాడు. దీంతో అతడి భార్య ఒక్కటే ఇంట్లో ఉంది. అయితే రాత్రి 10గంటల సమయంలో భర్తకు సమీప బంధువులైన ఇద్దరు యువకులు ఇంటికి వచ్చారు. భర్త బంధువులే కావడంతో ఆమె కూడా లోపలికి పిలిచింది.

ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన మహిళలు.. జరిగింది తెలుసుకుని షాక్.. చివరకు డాక్టర్‌ని ప్రశ్నించగా..

కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత వాళ్లకు టీ చేసేందుకు వంట గదిలోకి వెళ్లింది. అయితే అప్పటికే ఆమెపై కన్నేసిన ఇద్దరూ.. వెనుకే వంట గదిలోకి వెళ్లి నోరు మూశారు. నోట్లో గుడ్డ పెట్టి మరీ (Indecent behavior) అత్యాచారం చేశారు. భర్తకు చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చిన భర్తకు రాత్రి జరిగిన దారుణం గురించి చెప్పింది. తర్వాత ఇద్దరూ వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఆర్మీలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

పెళ్లి విషయం మాట్లాడాలంటూ కొడుకు ప్రియురాలిని పిలిచిన తండ్రి.. నేనున్నా అని హామీ ఇచ్చి.. ఊహించని విధంగా..

Updated Date - 2022-11-27T21:08:35+05:30 IST

Read more