Viral Video: వామ్మో! ఇలాంటి అనుభవం మీకూ ఎదురైందా.. నీళ్ల కోసం ఫ్రిజ్ వద్దకు వెళ్లగా షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-11-14T20:23:03+05:30 IST

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షాక్‌కి గురి చేస్తుంటాయి. జనారణ్యంలోకి క్రూర జంతువులు, విష సర్పాలు చొరబడుతుంటాయి. ఈ సమయంలో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మరికొన్ని సార్లు..

Viral Video: వామ్మో! ఇలాంటి అనుభవం మీకూ ఎదురైందా.. నీళ్ల కోసం ఫ్రిజ్ వద్దకు వెళ్లగా షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షాక్‌కి గురి చేస్తుంటాయి. జనారణ్యంలోకి క్రూర జంతువులు, విష సర్పాలు చొరబడుతుంటాయి. ఈ సమయంలో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మరికొన్ని సార్లు అదృష్టం బాగుండి.. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అలాంటి ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. నీళ్ల కోసం ఫ్రిజ్ వద్దకు వెళ్లిన వారికి షాకింగ్ సీన్ కనిపించింది.

ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసింది.. నాలుగు సంవత్సరాల తర్వాత గుట్టు బైటపడింది..

కర్నాటకలోని తుమకూరు (Karnataka Tumakuru District) జిల్లా కొతగెరె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. నీళ్ల కోసం రిఫ్రిజిరేటర్ (Refrigerator) వద్దకు వెళ్లిన వారు.. కింది భాగం నుంచి శబ్ధాలు రావడాన్ని గమనించారు. చివరకు ఫ్రిజ్ వెనుక వైపు కింద భాగంలో చూడగా.. అందులో వారికి పెద్ద నాగుపాము కనిపించింది. బుసలు కొడుతున్న పామును చూసి షాక్ అయ్యారు. చివరకు అటవీశాఖ అధికారులకు (Forest officials) సమాచారం అందించారు. దీంతో స్నేక్ క్యాచర్‌తో (Snake Catcher) సహా అక్కడికి చేరుకున్న అధికారులు.. పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇటీవల షూలో నాగుపాము బయటపడిన వీడియో వైరల్ (Viral videos) అయిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌లోని దతియాలో ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో పాము కనిపించింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. వస్తువులను ముట్టుకునే సందర్భాల్లో కాస్త పరిశీలిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

గొడవ తర్వాత.. భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచిన భార్య.. అందులో అతడు దాచిన వస్తువును చూసి.. చివరకు..

Updated Date - 2022-11-14T20:30:40+05:30 IST