యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

ABN , First Publish Date - 2022-11-23T17:30:47+05:30 IST

అతడికి అప్పటికే వివాహమైంది. అయినా భార్యకు తెలీకుండా ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. ఇటీవల ఈ విషయం భార్యకు తెలిసి, పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించాడు. అయితే..

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం

అతడికి అప్పటికే వివాహమైంది. అయినా భార్యకు తెలీకుండా ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. ఇటీవల ఈ విషయం భార్యకు తెలిసి, పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించాడు. అయితే ఇందుకు యువతి నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు. ఇటీవల ప్రేయసి గ్రామానికి వెళ్లి అతడు చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

భార్యను ముళ్ల పొదల మధ్యలోకి తీసుకెళ్లిన భర్త.. కాసేటికి స్థానికులు వెళ్లి చూడగా..

మహారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వాహోడా గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువకుడికి ఏడు నెలల క్రితం ఓ యువతి పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం (love) నడుస్తోంది. అయితే యువకుడికి అప్పటికే వివాహమైంది. భార్యకు తెలీకుండా యువతిని కలుస్తూ ఉండేవాడు. ఇటీవల ఈ విషయం భార్యకు తెలిసి.. భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటినుంచి ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేయసాగాడు.

పైకెళ్లి మాట్లాడుకుందామంటూ బాలికను తీసుకెళ్లిన స్వీపర్.. కాసేపటి తర్వాత ఎవరికీ చెప్పొద్దంటూ..

ఓ రోజు ఇదే విషయాన్ని ప్రేయసికి తెలియజేశాడు. అయితే ఇతడి మోసం గురించి తెలుసుకున్న యువతి.. అతన్ని దూరం పెట్టింది. దీతో అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్నాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై పదే పదే ఒత్తిడి తచ్చేవాడు. అయినా ఆమె ఏమాత్రం స్పదించకపోవడంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. మంగళవారం ప్రియురాలి గ్రామానికి వెళ్లి.. ఆమె తండ్రికి చెందిన మినీ ట్రక్, కూరగాయల దుకాణాన్ని తగులబెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

Updated Date - 2022-11-23T17:30:52+05:30 IST