భార్యను ముళ్ల పొదల మధ్యలోకి తీసుకెళ్లిన భర్త.. కాసేటికి స్థానికులు వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2022-11-22T21:03:09+05:30 IST

అనుమానం పెనుభూతం అన్నట్లుగా.. కొందరు మనసులో వివిధ అనుమానాలు పెంచుకుని చివరకు కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇక భార్యాభర్తల విషయంలో ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. రాజస్థాన్‌లో దంపతుల విషయంలో ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి ..

భార్యను ముళ్ల పొదల మధ్యలోకి తీసుకెళ్లిన భర్త.. కాసేటికి స్థానికులు వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

అనుమానం పెనుభూతం అన్నట్లుగా.. కొందరు మనసులో వివిధ అనుమానాలు పెంచుకుని చివరకు కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇక భార్యాభర్తల విషయంలో ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. రాజస్థాన్‌లో దంపతుల విషయంలో ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్యను ముళ్లపొదల మధ్యలోకి తీసుకెళ్లాడు. తర్వాత కాసేపటికి స్థానికులు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రేయసిని కలవడానికి కళాశాల వద్దకు వెళ్లిన యువకుడు.. మాటల మధ్యలో అతడు చేసిన పనికి..

రాజస్థాన్ (Rajasthan) ఉదయపూర్ జిల్లా పనర్వా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బహి ఘటీరయ్య గ్రామానికి చెందిన చందూలాల్, గీతాదేవి దంపతులకు (couple) 25ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల మద్యానికి బానిసైన ఘటీరయ్య.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ మద్యం తాగొచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా ఆమె భరిస్తూ వచ్చింది. శనివారం ఘటీరయ్య.. తన భార్యను గుజరాత్‌లోని (Gujarat) ఆశ్రమానికి తీసుకెళ్లాడు.

పైకెళ్లి మాట్లాడుకుందామంటూ బాలికను తీసుకెళ్లిన స్వీపర్.. కాసేపటి తర్వాత ఎవరికీ చెప్పొద్దంటూ..

అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో భార్యను కిందకు దింపి, ముళ్ల పొదల మధ్యకు తీసుకెళ్లాడు. సడన్‌గా ఆమెను కిందకు తోసేసి, ఛాతి మీద కూర్చున్నాడు. తర్వాత కత్తి తీసుకుని భార్య ముక్కు కోసేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

Updated Date - 2022-11-22T21:03:09+05:30 IST

Read more