దొంగతనానికి వచ్చిన దొంగలు.. డబ్బులు తక్కువ అవడంతో దంపతుల దుస్తుల్లో వెతికి.. చివరకు భర్త ముందే..

ABN , First Publish Date - 2022-11-11T20:55:10+05:30 IST

అప్పటిదాకా ఆనందంగా ఉన్న దంపతులు.. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగతనానికి ఇంట్లోకి చొరబడిన దుండగులు చంపేస్తామని బెదిరించడంతో మిన్నకుండిపోయారు. డబ్బులు, నగలు పోతేపోనీ అని అంతటితో సర్దుకున్నారు. కానీ..

దొంగతనానికి వచ్చిన దొంగలు.. డబ్బులు తక్కువ అవడంతో దంపతుల దుస్తుల్లో వెతికి.. చివరకు భర్త ముందే..

అప్పటిదాకా ఆనందంగా ఉన్న దంపతులు.. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగతనానికి ఇంట్లోకి చొరబడిన దుండగులు చంపేస్తామని బెదిరించడంతో మిన్నకుండిపోయారు. డబ్బులు, నగలు పోతేపోనీ అని అంతటితో సర్దుకున్నారు. కానీ అంతటితో ఆగని దొంగలు ఆ దంపతుల దుస్తులు కూడా విప్పించారు. వెళ్తూ వెళ్తూ చివరకు భర్త ఎదుటే దారుణానికి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మద్యానికి బానిసైన భర్త.. భార్య వల్లే అలా జరిగిందని అనుమానం.. చివరకు ఓ రోజు రాత్రి..

రాజస్థాన్ (Rajasthan) సిరోహిలోని పరిధి పిండ్వారా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లోకి బుధవారం రాత్రి కొందరు దొంగలు (thieves) చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లోని దంపతులు టీవీ చూస్తున్నారు. లోపలికి వెళ్లిన దండగులు.. ఒక్కసారిగా భార్యాభర్తలకు మెడ మీద కత్తి బెదిరించారు. ఊహించని ఈ పరిణామంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడ చంపేస్తారనే భయంతో మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు దొంగలు ఇళ్లంతా వెతికి కొంత నగదు, వెండి సమాన్లను (theft) తీసుకున్నారు. అయితే నగదు తక్కువగా ఉండడంతో భార్యాభర్తల దుస్తులు విప్పించి, మొత్తం వెతికారు. భర్త ప్యాంట్ జేబులో ఉన్న రూ.1400లు కూడా తీసుకున్నారు. తర్వాత భార్య లోదుస్తుల్లో కూడా వెతికారు.

కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..

అంతటితో ఆగకుండా భర్త ఎదుటే భార్యపై అసభ్యకరంగా ప్రవర్తించారు. చివరకు ఒకరి తర్వాత ఒకరుగా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తన కళ్లెదుటే జరుగుతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చోరీ, అత్యాచారం గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. తర్వాతి రోజు ధైర్యం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఇంతవరకు అరెస్ట్‌కి సంబంధించి వారు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు.

గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కొడుకు.. భార్య ప్రోత్సాహంతో.. తల్లి అని కూడా చూడకుండా..

Updated Date - 2022-11-11T20:55:10+05:30 IST

Read more