మద్యానికి బానిసైన భర్త.. భార్య వల్లే అలా జరిగిందని అనుమానం.. చివరకు ఓ రోజు రాత్రి..

ABN , First Publish Date - 2022-11-11T18:53:37+05:30 IST

ఉన్నదాంట్లో భర్తతో సంతోషంగా జీవిస్తున్న భార్యకు.. అతడి మూలంగానే సమస్యలు వచ్చిపడ్డాయి. కుటుంబ బాధ్యతలను మరచి.. తాగుడుకు బానిసైన భర్తను మనసు మార్చాలని ప్రయత్నించింది. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే..

మద్యానికి బానిసైన భర్త.. భార్య వల్లే అలా జరిగిందని అనుమానం.. చివరకు ఓ రోజు రాత్రి..

ఉన్నదాంట్లో భర్తతో సంతోషంగా జీవిస్తున్న భార్యకు.. అతడి మూలంగానే సమస్యలు వచ్చిపడ్డాయి. కుటుంబ బాధ్యతలను మరచి.. తాగుడుకు బానిసైన భర్తను మనసు మార్చాలని ప్రయత్నించింది. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే భార్య వల్లే తన ఆరోగ్యం క్షీణిస్తోందని భర్త కోపం పెంచుకున్నాడు. తనకు ఏ పాపం తెలీదని వేడుకున్నా వినిపించుకోలేదు. చివరకు అతడు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషాద హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రియురాలితో కలిసి బయటికి వెళ్లిన యువకుడు.. అంతలో డీజే వాయించాలంటూ స్నేహితుడి నుంచి ఫోన్.. తీరా అక్కడికి వెళ్లగా..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి జూని పరిధి టవర్ కూడలి ప్రాంతంలో సుదామా హిర్వే అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానిక అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా (watchman Job) పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అతడు మద్యానికి బానిస అయ్యాడు. దీంతో వచ్చే ఆదాయం మొత్తం మందు తాగేందుకే ఖర్చే చేసేవాడు. అప్పుడప్పుడూ భార్య వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకునేవాడు. విసిగిపోయిన భార్య.. ఎలాగైనా మద్యం మాన్పించాలని అనుకునేది. కానీ సుదామా మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఇటీవల రోజూ విపరీతంగా మద్యం సేవించేవాడు. కొన్నాళ్లుగా అతడికి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. తనకు అలా అవడానికి భార్యే కారణం అని అనుమానించాడు.

ప్రియురాలితో కలిసి హోటల్లో గది తీసుకున్న యువకుడు.. మరుసటి రోజు ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు సిబ్బంది వెళ్లగా..

తాను మద్యం మానుకునేలా.. ఏదో ఆయుర్వేద మందు ఇస్తోందని, అందుకే తన ఆరోగ్యం క్షీణిస్తోందని భావించాడు. ఈ కోపంలో రోజూ ఫుల్‌గా తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. తాను అలాంటి పనులేమీ చేయలేదని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతడి భార్య పొయ్యి వద్ద వంట చేస్తోంది. వచ్చీరాగానే భార్యతో అదే విషయమై గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో ఒక్కసారిగా భార్య తలను పట్టుకుని, మరుగుతున్న నూనెలో ముంచాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కేకలు విన్న స్థానికులు అక్కడికి వచ్చి.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని బాధితురాలిని విచారించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..

Updated Date - 2022-11-11T18:53:37+05:30 IST

Read more