ముగ్గురి ప్రాణాలు తీసి, మూడు నెలలుగా హడలెత్తించిన చిరుత.. ఎట్టకేలకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-11-24T16:36:43+05:30 IST

చిరుత పులి సంచారంతో ఆ గ్రామాల ప్రజలు మూడు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఈ క్రమంలో వరుసగా ముగ్గురిపై దాడి చేసి, చంపేయడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. అయితే ..

ముగ్గురి ప్రాణాలు తీసి, మూడు నెలలుగా హడలెత్తించిన చిరుత.. ఎట్టకేలకు ఏం జరిగిందంటే..

చిరుత పులి సంచారంతో ఆ గ్రామాల ప్రజలు మూడు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఈ క్రమంలో వరుసగా ముగ్గురిపై దాడి చేసి, చంపేయడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు అధికారుల చర్యలు ఫలించడంతో అంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: వృద్ధుడిపై ఎటాక్ చేసిన మొసలి.. చివరి నిముషంలో ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లఖింపూర్ ఖేరిలో ఓ చిరుత పులి (Leopard) మూడు నెలలుగా హడలెత్తించింది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో తరచూ గ్రామాల్లోకి చొరబడుతూ ఉండేది. దీంతో ప్రజలు కంటి మీద కనుకు లేకుండా గడిపారు. ఈ క్రమంలో ఆగస్టు 23న జుమునాబాద్ బ్లాక్ ఆరో బ్లాక్‌లో హరిరామ్(45) అనే వాచ్‌మెన్‌పై దాడి చేసింది. ఇతడి మృతదేహం ముళ్లపొదల్లో కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అదేవిధంగా అక్టోబర్ 4న హైదారవాబాద్‌లోని గోలా నారాయణపూర్ ప్రాంతానికి చెందిన రామ్ భజన్ (33) అనే వ్యక్తిపై కూడా దాడి (Tiger attack) చేసింది. ఇతడి మృతదేహం కూడా ముళ్లపొదల్లో లభ్యమైంది. అక్టోబర్ 20న హైదరాబాద్ రాంపూర్ గ్రంట్ ప్రాంతానికి చెందిన హీరాలాల్ (50)పై కూడా దాడి చేసి చంపేసింది.

Viral Video: ఆస్పత్రిలోకి అర్ధరాత్రి.. అదృశ్య వ్యక్తిని ఆహ్వానించిన సెక్యూరిటీ గార్డు.. దయ్యమే అంటూ పుకార్లు..

tiger.jpg

ఇలా వరుసగా ముగ్గురిని చంపేయడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు క్షణం క్షణం భయం భయంగా గడిపేవారు. మరోవైపు పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు (Forest Department officials) కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని పిలిచించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో బోనులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మంగళవారం చిరుతపులిని బోనులో బంధించారు. ఈ వార్త తెలియగానే ప్రజలంతా హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. పులిని చూసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బంధించిన చిరుతను కాన్పూర్‌లోని జూకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

Updated Date - 2022-11-24T16:40:57+05:30 IST