Viral Video: వృద్ధుడిపై ఎటాక్ చేసిన మొసలి.. చివరి నిముషంలో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-11-23T18:52:40+05:30 IST

మొసళ్లు ఎంత శక్తివంతమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి నోటితో పట్టుకున్నాయంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. పొంచి పొంచి మరీ జంతువులపై దాడులు చేసే మొసళ్లను తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు..

Viral Video: వృద్ధుడిపై ఎటాక్ చేసిన మొసలి.. చివరి నిముషంలో ఏం జరిగిందంటే..

మొసళ్లు ఎంత శక్తివంతమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి నోటితో పట్టుకున్నాయంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. పొంచి పొంచి మరీ జంతువులపై దాడులు చేసే మొసళ్లను తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు అదృష్టవశాత్తు వాటి బారి నుంచి క్షేమంగా బయటపడుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొసలిని బంధించేందుకు ఓ వృద్ధుడు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడిపై మొసలి అటాక్ చేస్తుంది. అయితే చివరి నిముషంలో ఏం జరిగిందో మీరే చూడండి..

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

viral.jpg

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) వైరల్ అవుతోంది. ఓ జూలో పెద్ద మొసలిని బంధించేందుకు ఓ వృద్ధుడు అక్కడికి వెళ్తాడు. ముందుగా దానిపై తలపై చొక్కా విసిరేస్తాడు. దీంతో మొసలి చూడటానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ క్రమంలో మెల్లగా మొసలి వద్దకు వెళ్తాడు. దానికి రెండు వైపులా కాళ్లు ఉంచి తలను అదిమి పట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తీరా చేతులు మీద వేయగానే.. ఒక్కసారిగా మొసలి ఎటాక్ చేస్తుంది. దీంతో అతడు ఎగిరిపక్కన పడతాడు. ఈ క్రమంలో అతడి చేయి కొరికేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అదృష్టవశాత్తు... చేయి గట్టిగా పక్కకు లాగడంతో ప్రమాదం తప్పుతుంది. తర్వాత అతడి కాలిని కొరికేందుకు ప్రయత్నించగా.. చాకచక్యంగా దాని నుంచి తప్పించుకుంటాడు. ఈ వీడియో (Crocodile videos) ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. నిజంగా ఈ వృద్ధుడు అదృష్టవంతుడు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఆస్పత్రిలోకి అర్ధరాత్రి.. అదృశ్య వ్యక్తిని ఆహ్వానించిన సెక్యూరిటీ గార్డు.. దయ్యమే అంటూ పుకార్లు..

Updated Date - 2022-11-23T18:52:51+05:30 IST