Viral Video: ఫొటోలకు ఫోజులిస్తున్న నూతన వధూవరులు.. సడన్‌గా ఊహించని ఘటన.. వెనక్కు తిరిగి చూస్తే..

ABN , First Publish Date - 2022-12-01T21:21:46+05:30 IST

ఆనందంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇటీవల ప్రతి సన్నివేశాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇలాంటి సందర్భాల్లో..

Viral Video: ఫొటోలకు ఫోజులిస్తున్న నూతన వధూవరులు.. సడన్‌గా ఊహించని ఘటన.. వెనక్కు తిరిగి చూస్తే..

ఆనందంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇటీవల ప్రతి సన్నివేశాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ నూతన వధూవరుల ఫొటోషూట్ సమయంలో ఇలాగే జరిగింది. వధూవరులు ఫొటోలకు ఫోజులిస్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. వెనక్కు తిరిగి చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పాటలు పాడుతూ యువతులతో ప్రేమ.. నాలుగు రాష్ట్రాల్లో ఆరు వివాహాలు.. ఓ రోజు రైల్వే స్టేషన్‌లో..

elephant-attack.jpg

కేరళలోని గురువాయూర్ ఆలయం (Kerala Guruvayur Temple) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ నూతన జంట ఫొటోషూట్ (Photo shoot) కోసం ఆలయం వద్దకు వెళ్లింది. భక్తజనం మధ్య ఫొటోలకు ఫోజులిస్తుండగా వెనుకే ఓ ఏనుగు (elephant) రావడాన్ని గమనించారు. ఏనుగు ఎదురుగా నిల్చుని ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించారు. ప్రశాంతంగా నిల్చున్న ఏనుగు ఎదురుగా వధూవరులు ఇద్దరూ నిల్చుని ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. అదే సమయంలో ఏనుగుకు కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న మావటిపై దాడి చేస్తుంది. కిందపడి ఉన్న అతడి దుస్తులను లాక్కుంటుంది. అయితే మావటి వెంటనే అప్రమత్తమై పక్కకు వెళ్లిపోతాడు. దీన్నంతా గమనిస్తున్న వధూవరులు ఉలిక్కిపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

తండ్రి మరణానికి ప్రతీకారంగా యువకుడిని ప్రేమించిన కుమార్తె.. ప్రియుడితో కలిసి మరో యువతికి తన దుస్తులు వేసి మరీ..

Updated Date - 2022-12-01T21:22:00+05:30 IST