రాత్రి వేళ వీధిలోకి వచ్చిన బాలుడిని వెంబడించిన కుక్కలు.. సడన్‌గా కిందపడ్డ చిన్నారి.. అంతలో..

ABN , First Publish Date - 2022-12-31T18:44:02+05:30 IST

కోతులు, కుక్కల బెడదతో చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ఈ సమస్యలు చాలా తీవ్రమై.. చివరకు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. పంజాబ్‌లోని ఓ గ్రామంలో ..

రాత్రి వేళ వీధిలోకి వచ్చిన బాలుడిని వెంబడించిన కుక్కలు.. సడన్‌గా కిందపడ్డ చిన్నారి.. అంతలో..

కోతులు, కుక్కల బెడదతో చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ఈ సమస్యలు చాలా తీవ్రమై.. చివరకు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. పంజాబ్‌లోని ఓ గ్రామంలో కుక్కల బెడదతో ప్రజలు ఇలాగే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ కొన్ని వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

Viral Video: స్టేషన్ రాకముందే బోగీ డోరు వద్ద నిల్చున్న మహిళ.. సడన్‌గా పైకి వచ్చిన యువకుడు..

viral-photos.jpg

పంజాబ్‌లోని (Punjab) లూథియానా శరభానగర్ పరిధి న్యూ సుదర్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు రాత్రి వేళ ఓ చిన్నారి దుకాణానికి వెళ్లేందుకు బయటకు వచ్చాడు. అదే సమయంలో కొన్ని కుక్కలు బాలుడిని వెంట పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు అతను పరుగులు పెట్టాడు. అయినా కుక్కలు (dogs) మాత్రం బాలుడిని వదల్లేదు. చాలా దూరం వెంటపడడంతో పాటూ మరోవైపు పలు చోట్ల గాయాలు కూడా చేశాయి. కొంత దూరం పరుగెత్తిన చిన్నారి సడన్‌గా కిందపడ్డాడు. అయినా అతడి మీదకు దాడి చేసేందుకు ప్రయత్నించాయి.

Viral Video: మంచు తుపాను దాటికి గడ్డ కట్టుకుపోయిన జింక మొఖం.. చివరకు ఏమైందో మీరే చూడండి..

చివరకు బాలుడు కాలితో తన్నడంతో కొంత వెనుకంజ వేశాయి. అదే సమయంలో పక్కనే ఉన్న ఇళ్ల నుంచి కొందరు వ్యక్తులు బయటకు వచ్చి, వాటిని తరిమికొట్టారు. చిన్నారిని రక్షించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుక్కల దాడిలో (dog attack) తీవ్రంగా గాయపడ్డ బాలుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు మాట్లాడుతూ చాలా రోజులుగా కుక్కల బెడద ఎక్కువైందని తెలిపారు. రోజూ ఎవరో ఒకరిపై దాడులు చేస్తున్నాయని, అధికారులకు తెలిపినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

Updated Date - 2022-12-31T18:44:02+05:30 IST

Read more