రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..

ABN , First Publish Date - 2022-12-09T19:20:41+05:30 IST

ఆనందంగా సాగుతున్న వారి సంసారం.. భర్త ప్రవర్తన కారణంగా సర్వనాశనం అయింది. భార్య మనసెరిగి మసలుకోవాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ఆమెను..

రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..

ఆనందంగా సాగుతున్న వారి సంసారం.. భర్త ప్రవర్తన కారణంగా సర్వనాశనం అయింది. భార్య మనసెరిగి మసలుకోవాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ఆమెను బలవంతం చేయసాగాడు. రెండోసారి శృంగారం వద్దన్న భార్యతో గొడవ పెట్టుకున్నాడు. వాగ్వాదం పెరగడంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. చివరకు తమ్ముడి సాయంతో దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ విషాద ఘటన వివారాల్లోకి వెళితే..

Viral Video: పెళ్లి మంటపంలోకి ఎంటరైన వధువును చూస్తే.. వారెవ్వా! అనాల్సిందే.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమ్రోహా పరిధిలో నివాసం ఉంటున్న హుస్సేన్ (పేరు మార్చాం).. స్థానికంగా బేకరీ నిర్వహిస్తుంటాడు. ఇతడికి హసీనా అనే భార్య ఉంది. వీరి కుటుంబంలో ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవు. అయినా భర్త ప్రవర్తన భార్య (wife) ప్రాణం మీదకు వచ్చింది. డిసెంబర్ 5న వేకువజాము 4గంటల సమయంలో హుస్సేన్.. శృంగారం చేయాలంటూ భార్యను ఇబ్బంది పెట్టాడు. అయితే రెండో సారి కూడా అలాగే చేయాలంటూ బలవంతపెట్టాడు. ఇందుకు హసీనా ఒప్పుకోలేదు. తనను ఇబ్బంది పెట్టొందంటూ బ్రతిమాలుకుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన హుస్సేన్.. తాడుతో భార్య గొంతు బిగించి హత్య చేశాడు.

ఒకే కంపెనీలో ఉద్యోగం.. మూడేళ్లుగా ప్రేమ.. ఇటీవల యువకుడి పెళ్లి ఊరేగింపు జరుగుతుందనగా.. సడన్‌గా..

తర్వాత తమ్ముడి సాయంతో ఆమె మృతదేహాన్ని (dead body) గోనెసంచిలో కుక్కి.. బైకుపై పెట్టుకుని, మోరాదాబాద్ జిల్లా రతుపురా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. మరుసటి రోజు మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అప్పటికే హసీనా కనబడలేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారని సమాచారం.. కొత్వాలి పోలీసుల ద్వారా అందింది. దీంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హుస్సేన్, అతడి సోదరుడిని అరెస్ట్ చేశారు. మహిళ హత్యతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..

Updated Date - 2022-12-09T19:29:30+05:30 IST

Read more