Viral Video: పెళ్లి మంటపంలోకి ఎంటరైన వధువును చూస్తే.. వారెవ్వా! అనాల్సిందే.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు..

ABN , First Publish Date - 2022-12-09T18:38:16+05:30 IST

సినిమాల్లో హీరో, హీరోయిన్ ఎంట్రీ లాగా.. ప్రస్తుతం వివాహ వేడుకల్లో వధూవరుల ఎంట్రీని వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు..

Viral Video: పెళ్లి మంటపంలోకి ఎంటరైన వధువును చూస్తే.. వారెవ్వా! అనాల్సిందే.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు..

సినిమాల్లో హీరో, హీరోయిన్ ఎంట్రీ లాగా.. ప్రస్తుతం వివాహ వేడుకల్లో (Wedding ceremonies) వధూవరుల ఎంట్రీని వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు, తమ పెళ్లి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరికొందరు విచిత్రమైన విన్యాసాలు (Strange stunts) చేస్తుంటారు. ఓచోట వరుడు గుర్రంపై వస్తే.. మరో చోట బైకుపై కుక్కను ఎక్కించుకుని వస్తాడు. అలాగే వధువు కూడా రోటీన్‌కు బిన్నంగా ట్రాక్టర్, బుల్లెట్ బైకు.. ఇలా వినూత్న రీతిలో మంటపంలోకి అడుగుపెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వధువు ఎంట్రీకి సంబంధించిన వీడియో (Viral videos) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

bride-entry.jpg

Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..

సోషల్ మీడియాలో ఓ వధువు.. కళ్యాణ మంటపంలోకి (wedding hall) వినూత్నంగా ఎంట్రీ ఇస్తుంది. అందరిలా కాకుండా ఎంట్రీ సరికొత్తగా ఉండాలని ప్లాన్ చేసుకున్నరో ఏమోగానీ.. మరీ విచిత్రంగా వధువును ఓ లగేజీ ట్రాలీపై నిలబెట్టి మంటపంలోకి (Brides entry) తీసుకొస్తారు. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువును తన సోదరులు.. వినూత్నంగా లగేజీ ట్రాలీపై (Luggage trolley) నిలబెడతారు. చెరో వైపు తోసుకుంటూ మంటపం వద్దకు తీసుకొస్తారు. మరోవైపు వధువు ట్రాలీ పైనుంచి ఎక్కడ కిందపడిపోతానో అని కంగారుపడుతూ ఉంటుంది. మొత్తానికి చివరకు ఎలాగోలా మంటపం వద్దకు తోసుకుంటూ వస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఒకే కంపెనీలో ఉద్యోగం.. మూడేళ్లుగా ప్రేమ.. ఇటీవల యువకుడి పెళ్లి ఊరేగింపు జరుగుతుందనగా.. సడన్‌గా..

Updated Date - 2022-12-09T18:38:23+05:30 IST