Whatsapp Alert: డిసెంబర్ 31 తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..!

ABN , First Publish Date - 2022-12-27T16:54:45+05:30 IST

చాలా స్మార్ట్ ఫోన్లలో డిసెంబర్ 31 తర్వాత నుంచి వాట్సాప్ పని చేయదు. వాటిలో Apple, Samsung, LG సహా దాదాపు 49 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కేవలం Android స్మార్ట్‌ఫోన్..

Whatsapp Alert: డిసెంబర్ 31 తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..!

స్మార్ట్ ఫోన్ (Smart phone) ఉన్న ప్రతి ఒక్కరూ... పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ.. వాట్సాప్‌తో మమేకమై ఉంటారు. నిత్యం వాట్సప్‌లో మెసేజ్‌లు, వీడియో కాల్స్ చేసుకోవడం పరిపాటిగా మారింది. వాట్సాప్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా, ప్రస్తుతం వాట్సాప్ యాజమాన్యం.. యూజర్లు షాక్ అయ్యే ప్రకటన చేసింది. డిసెంబర్ 31 తర్వాత Android మరియు iOS స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదని పేర్కొంది. మీరు వాడుతున్న ఫోన్.. ఈ జాబితా కిందకు వస్తుందా, లేదా అన్నది సరిచూసుకోవాల్సి ఉంటుంది.

Viral Video: వీడియో తీసుకోవడానికి విద్యుత్ స్తంభం ఎక్కాడు.. కాసేపటి తర్వాత అతడి పరిస్థితి..

చాలా స్మార్ట్ ఫోన్లలో డిసెంబర్ 31 తర్వాత నుంచి వాట్సాప్ పని చేయదు. వాటిలో Apple, Samsung, LG సహా దాదాపు 49 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కేవలం Android స్మార్ట్‌ఫోన్ వెర్షన్ 4.1, iOS 12 వెర్షన్లలో మాత్రమే వాట్సాప్ పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే KaiOS 2.5 ఆధారిత JioPhone, జియో ఫోన్ (JioPhone 2)లో కూడా వాట్సాప్ పని చేస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో రన్ అయ్యే ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్, అదేవిధంగా అంతకంటే తక్కువ వెర్షన్ OS, iOS 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో పాటూ విండోస్ ఫోన్లలో కూడా వాట్సాప్ సపోర్టును నిలిపివేయనున్నారు.

Viral Video: తాళం తీసి ఉన్నా సరే.. ఈ ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎవరూ చేయరేమో..!

వాట్సాప్ నిలిచిపోయే స్మార్ట్ ఫోన్‌ల జాబితా విషయానికొస్తే.. ఆర్కోస్ 53 ప్లాటినం, ఐఫోన్ 5, iPhone 5c, గ్రాండ్ S ఫ్లెక్స్ ZTE, గ్రాండ్ X క్వాడ్ V987 ZTE, HTC డిజైర్ 50, Huawei Ascend D, Huawei Ascend D1, Huawei Ascend D2, Huawei Ascend G740, Huawei Ascend Mate, Huawei Ascend P1, క్వాడ్ XL, Lenovo A820, LG ఎనాక్ట్LG లూసిడ్ 2, LG Optimus 4X HD, LG ఆప్టిమస్ F3, LG ఆప్టిమస్ F3Q, LG Optimus F5, LG ఆప్టిమస్ F6, LG Optimus F7, LG ఆప్టిమస్ L2 II, LG ఆప్టిమస్ L3 II, LG Optimus L3 II డ్యూయల్, LG ఆప్టిమస్ L4 II, LG Optimus L4 II డ్యూయల్, LG Optimus L5, LG Optimus L5 డ్యూయల్, LG Optimus L5 II, LG Optimus L7, LG Optimus L7 II, LG Optimus L7 II డ్యూయల్, LG ఆప్టిమస్ నైట్రో HD, మెమో ZTE V956, Samsung Galaxy Ace 2, Samsung Galaxy కోర్, Samsung Galaxy S2, Samsung Galaxy S3 మినీ, Samsung Galaxy Trend II, Samsung Galaxy Trend Lite, Samsung Galaxy Xcover 2, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా మీరో, సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్, వికో సింక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ ZT... ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి.

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

Updated Date - 2022-12-27T16:54:51+05:30 IST