Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2022-12-23T18:56:27+05:30 IST

పిల్లల జోలికి వస్తే మనుషులకు ఎంత కోపం వస్తుందో.. జంతువులు, పక్షులకు కూడా అంతే కోపం వస్తుంది. తమ పిల్లలను సంరక్షించుకునే క్రమంలో ఎంత పెద్ద జంతువులను కూడా లెక్క చేయవు. చిన్న చిన్న పక్షులు కూడా..

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

పిల్లల జోలికి వస్తే మనుషులకు ఎంత కోపం వస్తుందో.. జంతువులు, పక్షులకు కూడా అంతే కోపం వస్తుంది. తమ పిల్లలను సంరక్షించుకునే క్రమంలో ఎంత పెద్ద జంతువులను కూడా లెక్క చేయవు. చిన్న చిన్న పక్షులు కూడా.. పెద్ద జంతువులపై తిరగబడడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. గుడ్లను ఎత్తుకెళ్లడానికి వచ్చిన యువతిని ఓ నెమలి (peacock) ఏం చేసిందంటే..

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. నెమలి అనగానే అందమైన పించాలు, పురి విప్పి చేసే నాట్యం మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఆవేశం మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కోపంతో కట్టలు తెంచుకున్న నెమలిని చూడొచ్చు. ఓ యువతి (young woman) నెమలి గుడ్లను చోరీ చేసేందుకు వస్తుంది. గుడ్లపై ఉన్న నెమలిని ఎత్తుకుని పక్కన పడేస్తుంది. తర్వాత తాపీగా గుడ్లు అన్నింటినీ ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే పక్కనున్న నెమలికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఒక్కసారిగా గాల్లోంచి దూసుకొచ్చి, యువతిపై దాడి (Peacock attack on young woman) చేస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ యువతి ఎగిరి పక్కన పడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ యువతికి ఇలా జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఒక జింకపై రెండు సింహాల వేట.. తప్పించుకోవాలని ప్రయత్నించే క్రమంలో.. చివరలో ఏమైందంటే..

Updated Date - 2022-12-23T19:01:44+05:30 IST