ఒక జింకపై రెండు సింహాల వేట.. తప్పించుకోవాలని ప్రయత్నించే క్రమంలో.. చివరలో ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-12-23T18:23:00+05:30 IST

కొన్నిసార్లు సింహాల (lions) వేట చూస్తే.. వామ్మో!.. అందుకే కదా వీటిని సింహాలు అని అంటారు.. అని అనిపిస్తుంది. ఒకసారి అవి వేటను టార్గెట్ చేస్తే.. ఇక వాటి బారి నుంచి తప్పించుకోవడం దాదాపు..

ఒక జింకపై రెండు సింహాల వేట.. తప్పించుకోవాలని ప్రయత్నించే క్రమంలో.. చివరలో ఏమైందంటే..

కొన్నిసార్లు సింహాల (lions) వేట చూస్తే.. వామ్మో!.. అందుకే కదా వీటిని సింహాలు అని అంటారు.. అని అనిపిస్తుంది. ఒకసారి అవి వేటను టార్గెట్ చేస్తే.. ఇక వాటి బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక జింకను (deer) రెండు సింహాలు టార్గెట్ చేశాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు జింక.. విశ్వప్రయత్నాలు చేసింది. అయితే చివరకు ఏమైందంటే..

Viral Video: ఇదెక్కడి ఘోరం.. హోటళ్లో కూర్చుని ఉన్నా వదలని మృత్యువు.. ఎలా దూసుకొచ్చిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. పేరుకు తగ్గట్టుగా అడువుల్లో సింహాలు.. వాటి ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటాయి. వేట కోసం ఎంత దూరం వెంటబడటానికైనా అవి వెనుకాడవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు సింహాలు ఒక జింకను టార్గెట్ చేశాయి. ఓ ఎత్తైన కొండ మీద నుంచి జింక కోసం మాటు వేస్తాయి. అదును చూసి దానిపై పంజా విసురుతాయి. సింహాల నుంచి తప్పించుకునేందుకు జింక విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు దూకుతుంది. అయితే సింహాలు కూడా దాంతో పాటూ కిందకు దూకి గాల్లోనే జింకను పట్టుకుంటుంది. పక్కన ఉన్న మరో సింహం దానికి సాయం చేస్తుంది. చివరకు జింక వాటికి ఆహారంగా మారుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సింహం వేట అంటే ఇలాగే ఉంటుంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

Updated Date - 2022-12-23T18:23:08+05:30 IST