Viral Video: తాళం తీసి ఉన్నా సరే.. ఈ ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎవరూ చేయరేమో..!

ABN , First Publish Date - 2022-12-27T15:29:05+05:30 IST

పాము.. ఈ పేరు చెప్పగానే మనకు తెలీకుండానే ఒంట్లోకి భయం ఆవహిస్తుంది. ఇక అదే పాము మనకు సమీపంలో కనిపిస్తే.. ఇక గుండె ఆగినంత పనవుతుంది. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో పాములు ప్రత్యక్షమవడం.. మనం ఇటీవల..

Viral Video: తాళం తీసి ఉన్నా సరే.. ఈ ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎవరూ చేయరేమో..!

పాము.. ఈ పేరు చెప్పగానే మనకు తెలీకుండానే ఒంట్లోకి భయం ఆవహిస్తుంది. ఇక అదే పాము మనకు సమీపంలో కనిపిస్తే.. ఇక గుండె ఆగినంత పనవుతుంది. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో పాములు ప్రత్యక్షమవడం.. మనం ఇటీవల చాలా సార్లు చూశాం. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఫ్రిజ్‌లలోకి చొరబడడం, అలాగే.. తీరా కాలు పెట్టే సమయంలో బూట్లలో నుంచి బుసలు కొట్టుకుంటూ బయటికి రావడం, పడుకుని ఉన్న వారి మీద పడగ విప్పి నాట్యం చేయడం.. వంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా, పాముకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. తలుపు తీద్దామని ప్రయత్నించడంతో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ.. పెద్ద నాగు పాము తలుపు సందు నుంచి వచ్చి, పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Viral Video: పెళ్లిలో బంధువులంతా డ్యాన్స్ చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన.. అంతా చూస్తుండగానే..

సోషల్ మీడియాలో (social media) పాముకు సంబంధించిన వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తలుపు తీద్దామని ప్రయత్నించగా.. ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో గానీ, ఓ పెద్ద నాగుపాము (Cobra) తలుపు సందు నుంచి వచ్చి బుసలు కొట్టింది. దీంతో భయపడిపోయిన ఆమె భయంతో పరుగులు పెట్టింది. దూరం నుంచి అది ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి పామును వీడియో తీస్తాడు. అయితే అతడి మీదకు కూడా పాము బుసలు కొడుతూ కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు మహిళ దూరంగా నిలబడి భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో! తలుపు కాస్తలో ప్రమాదం తప్పింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

పరాయి వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పిన భార్య.. ఫోన్‌లో అసభ్యకర ఫొటోలు చూసిన భర్త.. ఎవరికీ చెప్పకుండా..

Updated Date - 2022-12-27T15:32:19+05:30 IST