పదే పదే బయటికి వెళ్తున్న భార్య.. యువకులతో కలిసి డ్రగ్స్ తీసుకోవడంతో పాటూ.. ఆమె చేసిన నిర్వాకంతో.. చివరకు..

ABN , First Publish Date - 2022-11-23T16:16:06+05:30 IST

సాధారణంగా భర్తలు మద్యానికి బానిసై భార్యలను చిత్రహింసలకు గురి చేయడం, కుటుంబ బాధ్యతలు మరచి ప్రవర్తించడం జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుటుంబంలో విచిత్ర సమస్య నెలకొంది. భర్తకు తెలీకుండా భార్య డ్రగ్స్‌కు బానిసైంది. పదే పదే బయటికి వెళ్తూ.. యువకులతో ..

పదే పదే బయటికి వెళ్తున్న భార్య.. యువకులతో కలిసి డ్రగ్స్ తీసుకోవడంతో పాటూ.. ఆమె చేసిన నిర్వాకంతో.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా భర్తలు మద్యానికి బానిసై భార్యలను చిత్రహింసలకు గురి చేయడం, కుటుంబ బాధ్యతలు మరచి ప్రవర్తించడం జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుటుంబంలో విచిత్ర సమస్య నెలకొంది. భర్తకు తెలీకుండా భార్య డ్రగ్స్‌కు బానిసైంది. పదే పదే బయటికి వెళ్తూ.. యువకులతో కలిసి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంది. భర్తకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భర్త చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

భార్యను ముళ్ల పొదల మధ్యలోకి తీసుకెళ్లిన భర్త.. కాసేటికి స్థానికులు వెళ్లి చూడగా..

పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. యూపీలోని (UP) సీతాపూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంకజ్, జ్యోత్స్న దంపతులు (couple) స్థానికంగా నివాసం ఉంటున్నారు. సాధారణంగా భర్తలు మద్యానికి బానిసై.. కుటుంబ బాధ్యతలు మరచిపోయి ప్రవర్తిస్తుంటారు. కానీ విచిత్రంగా ఇక్కడ విచిత్రంగా పంకజ్ భార్య.. ఇటీవల డ్రగ్స్‌కు (Drugs) బానిసైంది. ఈ క్రమంలో భర్తను కాదని పలువురు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యపై అనుమానం వచ్చి విచారించగా పంకజ్‌కు అసలు విషయం తెలిసింది. దీంతో పలుమార్లు భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో చాలా సార్లు ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె మళ్లీ డ్రగ్స్ తీసుకోవడంతో పాటూ పలువురు యువకులతో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగించింది. భార్య ప్రవర్తనతో భర్త పంకజ్ విసిగిపోయాడు.

పైకెళ్లి మాట్లాడుకుందామంటూ బాలికను తీసుకెళ్లిన స్వీపర్.. కాసేపటి తర్వాత ఎవరికీ చెప్పొద్దంటూ..

wife-death.jpg

చివరకు భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. భార్యను హత్య చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. తర్వాత వాటిని గోనె సంచిలో వేసి, రాంపూర్ కలాన్ పరిధిలోని గుల్హరియన్ గ్రామ పరిసరాల్లో పడేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ పంకజ్.. పోలీసులను తప్పుదోవ పట్టించాడు. అయితే ఇటీవల పోలీసులు మృతురాలి ఇంటికి వెళ్లి భర్తను విచారించారు. అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్టేషన్‍‌కి తరలించి, తమదైన స్టైల్‌లో విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో పంకజ్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

Updated Date - 2022-11-23T16:17:52+05:30 IST

Read more