Viral Video: ఇదేం వింత.. చెప్పును తీసుకుని ఈ పాము ఏం చేస్తోందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2022-11-25T16:53:42+05:30 IST

సాధారణంగా పాములు వాటి దారిన అవి వెళ్తుంటాయి. ఎప్పుడైతే ఎవరైనా వాటి జోలికి వెళ్తారో అప్పుడే అవి రియాక్ట్ అవుతాయి. పాములు తమ ఆహారం కోసం అవసరమైన ప్రాణులను తప్ప.. మనుషులు, వస్తువులను అవి ఎప్పుడూ టార్గెట్ చేయవు. కానీ..

Viral Video: ఇదేం వింత.. చెప్పును తీసుకుని ఈ పాము ఏం చేస్తోందో మీరే చూడండి..!

సాధారణంగా పాములు వాటి దారిన అవి వెళ్తుంటాయి. ఎప్పుడైతే ఎవరైనా వాటి జోలికి వెళ్తారో అప్పుడే అవి రియాక్ట్ అవుతాయి. పాములు తమ ఆహారం కోసం అవసరమైన ప్రాణులను తప్ప.. మనుషులు, వస్తువులను అవి ఎప్పుడూ టార్గెట్ చేయవు. కానీ ప్రస్తుతం ఓ వింత పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (snakes Videos) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము అదే పనిగా ఓ చెప్పును టార్గెట్ చేస్తుంది. దాంతో ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు అదే పనిగా తీసుకెళ్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో!.. ఇదేం వింత అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ పాము చెప్పు తీసుకుని ఏం చేసిందో మీరే చూడండి..

Viral Video: వృద్ధుడిపై ఎటాక్ చేసిన మొసలి.. చివరి నిముషంలో ఏం జరిగిందంటే..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ పాము నేరుగా పిచ్చి మొక్కల వద్దకు వస్తుంది. ఏం చేస్తుందబ్బా.. అని అనుకునే లోపే.. పిచ్చి మొక్కల మధ్యన ఉన్న ఓ పాత చెప్పును నోటితో బయటికి తీస్తుంది. మొదట దాని బరువును బ్యాలెన్స్ చేయలేక కింద పడేస్తుంది. తర్వాత నోటితో చెప్పును గట్టిగా పట్టుకుని పైకి ఎత్తుతుంది. అంతటితో ఆగకుండా ఆ చెప్పుతో ఏదో అర్జంట్ పనున్నట్లు.. నోటితో అలాగే పట్టుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఎవరన్నా వస్తే చెప్పును తీసుకెళ్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయి.. కాస్త దూరంలో ఉన్న ఇటుక రాళ్ల మధ్యకు తీసుకెళ్తుంది. పాము ఏంటీ.. చెప్పును తీసుకెళ్లడం ఏంటీ.. అని నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనిపై ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. బహుశా.. ఈ పాము తన శత్రువును చెప్పుతో కొట్టడానికేమో.. అని ఒకరు, చెప్పుతో పాటూ సాక్సులు కూడా కావాలేమో.. అని ఇంకొకరు.. పాములు దొంగతనాలు కూడా చేస్తాయా... అంటూ మరొకరు స్పందిస్తున్నారు.

ఫొటో తీయాలంటూ.. మహిళను ముఖం కడుక్కుని రమ్మన్న యువకులు.. కాసేపటికి..

Updated Date - 2022-11-25T17:10:04+05:30 IST