Viral Video: కోతితో బాక్సింగ్ ఆడాలని చూసిన బాలుడికి.. ఎలా బుద్ధి చెప్పిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2022-11-20T19:43:26+05:30 IST

మనదారిన మనం వెళ్లిపోతున్నా కొన్నిసార్లు కోతులు దాడులు చేస్తుంటాయి. ఒకవేళ తినుబండారాలు కనిపిస్తే లాక్కునే వరకూ వదలవు. అలాంటిది వాటితో కావాలని గొడవ ఎవడైనా పెట్టుకుంటారా అంటే.. అమ్మో! అని అంటాం. కానీ..

Viral Video: కోతితో బాక్సింగ్ ఆడాలని చూసిన బాలుడికి.. ఎలా బుద్ధి చెప్పిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మనదారిన మనం వెళ్లిపోతున్నా కొన్నిసార్లు కోతులు దాడులు చేస్తుంటాయి. ఒకవేళ తినుబండారాలు కనిపిస్తే లాక్కునే వరకూ వదలవు. అలాంటిది వాటితో కావాలని గొడవ ఎవడైనా పెట్టుకుంటారా అంటే.. అమ్మో! అని అంటాం. కానీ కొందరు కోతుల ముందే కోతి చేష్టలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కోతులు కూడా తగిన విధంగా బుద్ధి చెబుతుంటాయి. గోర్లతో రక్కి రక్కి మరీ చుక్కలు చూపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోతి చాలా విచిత్రంగా ఉన్నట్టుంది. కోతితో బాక్సింగ్ ఆడాలని చూసిన ఓ తుంటరి బాలుడికి.. అదే స్థాయిలో పంచ్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది..

Viral Video: అంత పెద్ద సింహాన్ని కుక్కను చేసిన యువకుడు.. ఏం చేశాడో చూడండి..

monkey4.jpg

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. సైలెంట్‌గా కూర్చుని ఉన్న కోతి వద్దకు ఓ తుంటరి బాలుడు వెళ్లి తమాషా చేస్తాడు. కోతి ముందుకు వెళ్లి బాక్సింగ్ ఆడుతూ చేతులు ముందుకు పెట్టుకుని కోతి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. దీంతో ముందు కోతి నోరు తెరచి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాతో పెట్టుకోకు అన్నట్లుగా హెచ్చరిస్తుంది. అయినా బాలుడు మాత్రం మళ్లీ కోతిని వెక్కిరించే ప్రయత్నం చేస్తాడు. దీంతో కోతికి తిక్క రేగుతుంది. నా ముందే కోతి చేష్టలు చేస్తావా.. నీకు బాక్సింగ్ తరహాలోనే బుద్ధి చెబుతా ఉండు.. అన్నట్లుగా.. ఒక్కసారిగా వెనక్కు తిరిగి కాలితో ఒక్క పంచ్ ఇస్తుంది. సాధారణంగా గోర్లతో రక్కే కోతి.. ఇలా విచిత్రంగా కాలితో వెరైటీగా తన్నడం.. అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో (monkey Videos) నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..

Updated Date - 2022-11-20T19:43:30+05:30 IST