Viral Video: అంత పెద్ద సింహాన్ని కుక్కను చేసిన యువకుడు.. ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2022-11-20T19:09:43+05:30 IST

సింహాలు, పులులను దూరంగా చూడటానికే భయంతో వణికిపోతాం. అలాంటిది వాటికి దగ్గరగా వెళ్లే ఆలోచన కలలో కూడా రాదు. అయితే కొందరు మాత్రం వాటితో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. సింహాలు, పులులు కూడా పిల్లుల్లా మారిపోయి ..

Viral Video: అంత పెద్ద సింహాన్ని కుక్కను చేసిన యువకుడు.. ఏం చేశాడో చూడండి..

సింహాలు, పులులను దూరంగా చూడటానికే భయంతో వణికిపోతాం. అలాంటిది వాటికి దగ్గరగా వెళ్లే ఆలోచన కలలో కూడా రాదు. అయితే కొందరు మాత్రం వాటితో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. సింహాలు, పులులు కూడా పిల్లుల్లా మారిపోయి భయభక్తులతో ఉండడం చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సింహాన్ని కుక్కలా చేసి, కర్రతో అదిలించడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్.. ఆరు నిముషాల్లో వారు చేసిన పని..

lion22.jpg

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. అడవిలో ఓ సింహం ( lion) గాండ్రిస్తూ యువకుడి మీదకు వెళ్తుంది. అయితే అతడు మాత్రం ఏమాత్రం భయపడకుండా కర్ర తీసుకుని.. అంతే కోపంతో దాన్ని అదిలిస్తాడు. అయితే సింహం కాసేపు అతడి మీదకు దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం వెనక్కు వెళ్తావా.. లేదా.. అంటూ కర్ర తీసుకుని కొట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో అంత పెద్ద సింహం.. ఒక్కసారిగా కుక్క పిల్లలా మారిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నట్లుగా తోక ముడిచి అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. బహుశా అతను ట్రైనర్ అయ్యుంటాడు.. అని ఇంకొందరు.. అడవికి రాజు సింహం అయితే.. ఇతను రారాజులా ఉన్నాడే.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..

Updated Date - 2022-11-20T19:09:48+05:30 IST