ఏం ఐడియా గురూ.. ఈ వ్యక్తి కారునే దుకాణంగా మార్చడం వెనుక కథేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-11-25T18:30:52+05:30 IST

పనికి రావనుకుని పక్కన పడేసే వస్తువులతోనే.. కొందరు ప్రపంచం నివ్వెరపోయేలా అద్భుతాలు సృష్టిస్తుంటారు. పాత వస్తువులను ఇలాక్కూడా ఉపయోగించుకోవచ్చా.. అని అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంటుంది. ఇందుకు సంబంధించిన..

ఏం ఐడియా గురూ.. ఈ వ్యక్తి కారునే దుకాణంగా మార్చడం వెనుక కథేంటో తెలిస్తే..!

పనికి రావనుకుని పక్కన పడేసే వస్తువులతోనే.. కొందరు ప్రపంచం నివ్వెరపోయేలా అద్భుతాలు సృష్టిస్తుంటారు. పాత వస్తువులను ఇలాక్కూడా ఉపయోగించుకోవచ్చా.. అని అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాత కారును దుకాణంగా మార్చిన ఓ వ్యక్తిని చూసి.. వావ్! ఏం ఐడియా గురూ.. అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే..

ఫొటో తీయాలంటూ.. మహిళను ముఖం కడుక్కుని రమ్మన్న యువకులు.. కాసేపటికి..

car-business.jpg

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోకు చెందిన ఓ వ్యక్తి ‘‘పాత మారుతి 800’’ కారును (Maruti car) ఏకంగా దుకాణంగా మార్చేశాడు. వ్యాపారం చేయాలని అతడికి కోరిక ఉండేది. కానీ స్థల సమస్య, ఆక్రమణల భయంతో ఆలోచనలో పడ్డాడు. అయితే ఎలాగైనా తన ఆశయాన్ని ఆచరణలోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఇంకేముందీ వెంటనే తన మెదడుకు పని పెట్టాడు. మారుతి పాత కారును చూడగానే తనకో ఐడియా వచ్చింది. కారు పైన టాప్‌ని తొలగించి, దానిపై చిన్నపాటి బంకును ఫిక్స్ చేశాడు. అందులో టీ, స్వీట్లు, పాన్ తదితరాలను విక్రయించడం మొదలెట్టాడు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కారును ఆపడం, వీలు ఉన్నంత సేపు వ్యాపారం (business) చేయడం.. మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లడం చేస్తుంటాడు. తనకు ఎలాంటి స్థల సమస్య, ఆక్రమణల సమస్య లేదని.. చెబుతున్నాడీ వ్యాపారి. ఇతడికి కారు వ్యాపారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిరు వ్యాపారిని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఇదేం వింత.. చెప్పును తీసుకుని ఈ పాము ఏం చేస్తోందో మీరే చూడండి..!

Updated Date - 2022-11-25T18:30:52+05:30 IST

Read more