Draupadi Murmu: సున్నిపెంట హెలిపాడ్‌కు చేరుకున్న రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-12-26T12:07:23+05:30 IST

శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిపాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

Draupadi Murmu: సున్నిపెంట హెలిపాడ్‌కు చేరుకున్న రాష్ట్రపతి

నంద్యాల: శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము President Draupadi Murmu ) సోమవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిపాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (AP Religion Minister Kottu Satyanarayana), ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి (Finance Minister Buggana Rajendranath Reddy), ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి (, MLA Chakrapani Reddy)ఘన స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట హెలిపాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రాష్ట్రపతి సాక్షిగణపతి ఆలయానికి బయలుదేరారు.

మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. రాష్ట్రపతి పర్యటన అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భక్తులకు దర్శనాలు పున ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2022-12-26T12:07:24+05:30 IST