AP Elections: హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు...: చంద్రబాబు
ABN , Publish Date - May 10 , 2024 | 11:37 AM
Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
విశాఖపట్నం, మే 10: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
AP Elections: ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం
‘‘హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్ళు. 4 శాతం రిజ్వేషన్లను నేను కాపాడుతాను. అబ్దుల్ కలాంను వాజ్ పాయ్ హయాంలో రాష్ట్రపతిని చేశాం. ఆనాడు కాంగ్రెస్‌ను కూడా ఒప్పించాం.. ఇది మా చరిత్ర. హైదారాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడిన వ్యక్తిని నేను. హైదారాబాద్ అభివృద్ధి చేశాను... ఆ కారణంగా ముస్లిం బాగుపడ్డారు. హైదారాబాద్‌కు ఉర్దూ యూనివర్సిటీని నేను తెచ్చాను. ఆనాడు 13 జిల్లాల్లో ఉర్దూ సెకండ్ లాగ్వేజ్ చేశాం. హైదారాబాద్‌లో హజ్ హౌజ్ కట్టాం.. హజ్ యాత్ర కోసం డైరెక్ట్ ఫ్లైట్ చేశాం’’ అని చెప్పుకొచ్చారు.
AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే
ముస్లిం మత పెద్దలకు గౌరవ వేతనం ఇచ్చిన పార్టీ టీడీపీ (TDP) అని తెలిపారు. రంజాన్ తోఫా, దిలహన్ ఇచ్చామని.. తాను సీఎంగా ఉన్నపుడు మాత్రమే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికల మ్యానిస్టోలో ముస్లింల కోసం ఎన్నో అంశాలను పెట్టామన్నారు. హజ్ యాత్రకు లక్ష ఇస్తామని.. మైనార్టీ కార్పోరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
జగన్ ఏమీ చేయరు.. ముద్దులే పెడతారు...
సీఎం జగన్ (CM Jagan) చేసే చేతలకు.. మాటలకీ పొంతన లేదని విమర్శించారు. జగన్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకు వస్తున్నారని.. ఈ చట్టం వస్తే.. భూములు దోచుకుంటారని అన్నారు. జగన్‌తో ఆయన తల్లి లేదు, చెల్లెలు లేదన్నారు. జగన్ ఏమీ చేయరని... కేవలం ముద్దులు మాత్రమే పెడతారంటూ సెటైర్ విసిరారు. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లోకి వస్తాడని అనుకోలేదన్నారు. ‘‘మీరు అబ్దుల్ సలాంను ఏం చేశారు... ఆయన కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్నారు. నా మైనార్టీ అంటున్నవారు.. వారి ఇంటికి వెళ్లి ఎందుకు పరామర్శించలేదు? రాష్ట్రంలో ఎంతో మంది మైనార్టీలు జగన్ సర్కార్ వలన తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. చాలా మంది చనిపోయారు. సీఏఏ ఎన్‌ఆర్‌సీ ఎవరు సపోర్ట్ చేసారు? వైసీపీ మద్దతు ఇవ్వలేదా? ముస్లింకు మేము అండగా ఉంటాం... సమైఖ్య ఆంధ్రలో కూడా మేము న్యాయం చేశాం’’ అని టీడీపీ అధినేత వెల్లడించారు.
TS News: మా నాన్నని బతికించండి..
ఎంత ఘోరం..
రాష్ట్రం భయం గుప్పిట్లో ఉందని.. తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. మసీదులు కట్టించిన వాడిని తానని.. కూల్చి వేసానని ఆరోపణలు చేస్తున్నారని.. ఎంత ఘోరమని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్‌లో సోనియా (Congress leader Sonia Gandhi) వెనుక జగన్ ఉన్నారన్నారు. తాను చేసిన మంచి పనులకు.. ముస్లింలు వన్ సైడ్‌గా తమకు ఓట్లు వేయాలని.. ఎన్డీఏకు అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.
ఇవి కూడా చదవండి..
MLA: పాలనను మరచి కేసీఆర్‌ను తిట్టడానికి పోటీపడుతున్నారు..
Loksabhapolls: బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. హరీష్ విమర్శ
Read Latest AP News And Telugu News