టమాటా ధరలు కొద్ది రోజుల నుంచి రూ.2 నుంచి రూ.3లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ మార్కెట్లకు రైతులు తీసుకువస్తున్న టమాటాలు హోల్‌సేల్‌గా మాత్రమే ధర లభిస్తున్నది. దీంతో పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
16వ శతాబ్దపు పండితుడు రఘునాథ సూరి రచించిన ‘భోజనకుతూహలం’ గ్రంథానికి ఆచార్య బాలకృష్ణ ఆంగ్లానువాదం ప్రచురిస్తూ, వైద్యరాజ కాశీనాథ పండితుడు రచించిన అజీర్ణామృతమంజరి గ్రంథంలోంచి అజీర్ణశమనం అనే అధ్యాయాన్ని అందించారు.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ కథ ప్రసిద్ధమే! చావుబతుకుల్లో ఉన్న ఓ చదువరిని పలకరిద్దామని వచ్చిన మిత్రుణ్ణి చూసి, ఆ చివరి క్షణాల్లో కూడా తెలియనిదాన్ని తెలుసు కోవాలనే జిజ్ఞాసతో ‘‘ఇంగువ ఎలా తయార వుతుందంటావ్...?’’ అని అడుగుతాడు.
క్యారెట్, చిలగడదుంప, కంద.. దేని ప్రత్యేకత దానిదే అయినప్పటికీ, ఇవన్నీ సమాన గుణ ధర్మాలు కలిగినవే. వీటిలో బీటా కెరోటిన్ (విటమిన్-ఎ) మన శరీరానికి కావాల్సిన దానికన్నా నాలుగు రెట్లు అధికంగా లభిస్తుంది.
మనం మరచిపోయిన భారతీయ ఫల సంపద వెలగపండు! లోపల గుజ్జు పుల్లగానూ, తియ్యగానూ ఉండి విలక్షణమైన లక్షణాలు వెలగకున్నాయి. పుల్లగా ఉన్నప్పటికీ పులుపు వలన కలిగే ఎసిడిటీ లాంటి అనర్థాలను తగ్గిస్తుంది.
అలసందలు తిన్న వెంటనే పొట్ట బరువుగా, ఎసిడిటీ పెరిగినట్టుగా అనిపించినా, జీర్ణప్ర క్రియ పూర్తయ్యేసరికి అదే ఎసిడిటీని తగ్గిస్తాయి. తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వెయ్య నివ్వకుండా పొట్ట దండిగా ఉండటాన ఉదయంపూట షుగరు మాత్రలు వేసుకునే వారికి అలసందల సలాడ్ చాలా అనుకూలం.
పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు.
పెసరపప్పుతో ఉత్తపప్పు, పప్పు కూరలు, పచ్చడి, పెసరట్లు, పులుసు, సాంబారు, గారెలు, వడియాలు, వడలు, అప్ప డాలు, పూర్ణాలు, అప్పాలు, పాయసం, హల్వా ఇవన్నీ వండుకునే వాళ్లు. డైటింగ్ చేసేవాళ్లకి పెసరపప్పే అనుకూలంగా ఉంటుంది.
భారతీయుల రోటీలు నచ్చక మొగలాయీ ప్రభువు బాబర్, ‘నాన్’ రోటీలు తయారు చేసే వంటవాళ్లనీ, వంటపదార్థాల్నీ ఇరాన్, ఉజ్బెకి స్తాన్ నుండి వెంట తెచ్చుకున్నాడు. వాళ్లతో వచ్చింది ఇక్కడికి మైదా! మొగలాయీలకు, యూరోపియన్లకూ ఇది విలాస రుచి!
భూమిలోపల అలముకుంటుంది (వ్యాపిస్తుంది) కాబట్టి అల్లం అయ్యింది. తెలుగువాళ్లు శాస్త్రీయంగా పేర్లు పెట్టటంలో దిట్టలనటానికి అల్లమే సాక్షి! పచ్చి అల్లంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని ఆర్ద్రకం అన్నారు.