Home » Telangana » Rangareddy
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నతూండ్లకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించాడు. శవాన్ని రాత్రి వేళ గ్రామానికి తరలించారు. అయితే, అతడి మరణంపై అనుమానం ఉండటంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..
మైనర్‌కు వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులకు చైల్డ్‌లైన్, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
పొలం చదును చేస్తుండగా ఓ యువ రైతు ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన తాండూరు మండలం చెంగోల్‌లో చోటుచేసుకుంది.
క్రీడలతో మానసికోల్లాసం, శారీరక ధారుఢ్యం పెరుగుతుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కొందుర్గు మండల పరిధిలోని ఆగిర్యాలలో ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
శాసనసభ ఎన్నికల ముందు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళి కృష్ణగౌడ్ కు సంబంధించిన సెల్‌ఫోన్‌ను ట్రాప్ చేశారని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం విచారణ జరిపారు.
మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మండల పూజలో భాగంగా సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయం 41 రోజులు పూర్తి చేసుకోవడంతో గ్రామ ప్రజలు మండల పూజ నిర్వహించారు. ప్రతిష్ఠ వైదిక పురోహితులు, ఛండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజుశర్మ ఆధ్వర్యంలో పురోహితులు సీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.
మండలంలోని పలు గ్రామాల పరిధిలోని వ్యవసాయేతర భూములు, నాపరాళ్ల గుట్టలకు పెద్ద ఎత్తున రైతుబంధు పథకం కింద చెల్లింపులు జరిగినట్లు తేలింది.
అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు.
కళాశాలకు బైక్‌పై వెళ్లుతున్న విద్యార్థులు మరో బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మోమిన్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.