హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:09 AM
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సున్నం శ్రీనివా్‌సరెడ్డి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ నారాయణరెడ్డి వివరించారు.
తాండూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సున్నం శ్రీనివా్‌సరెడ్డి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ నారాయణరెడ్డి వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 సంవత్సరంలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారంపేట్‌లో మ్యాతరి శాంత కుమార్ తన భార్యను కొట్టి చంపాడు. దీంతో మృతురాలి అన్న మొంగరగని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అప్పటి తాండూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ప్రస్తుత తాండూరు ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ చార్జ్‌షిట్‌ను సమర్పించగా వాదోపవాదనలు విన్న అనంతరం జిల్లా న్యాయాధికారి డాక్టర్ సున్నం శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం నిందితుడు మ్యాతరి శాంత్‌కుమార్‌కు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితునికి శిక్షపడే విధంగా పని చేసిన పీపీ సుధాకర్‌రెడ్డి, మొదటి ఐవోలు కె.రాజేందర్‌రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీడీవో సలీంపాషా, బ్రిఫింగ్ ఆఫీసర్లు బి.వీరన్నలను ఎస్పీ అభినందించారు.