రోడ్డుకిరువైపులా మొక్కలు దగ్ధం
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:35 PM
ఎన్కెపల్లి గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి.
బొంరా్‌సపేట్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఎన్కెపల్లి గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. గమనించిన గ్రామస్థులు, పూజారి నర్సింహులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొడంగల్ నుంచి అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పేశారు.