Share News

చికిత్స పొందుతూ లైన్‌మన్‌ మృతి

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:34 PM

కొడంగల్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కేశవరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ లైన్‌మన్‌ మృతి

కొడంగల్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కేశవరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 27వ తేదీన విధులు ముగించుకొని కొడంగల్‌ నుంచి కోస్గిలోని తన ఇంటికి వెళ్తుండగా నాచారం గ్రామ స్టేజీ దగ్గర బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన కేశవరెడ్డిని మహబూబ్‌నగర్‌కు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు.

Updated Date - Feb 01 , 2025 | 11:34 PM