Share News

రెండు వాహనాలు ఢీ.. ఆరుగురికి గాయాలు

ABN , Publish Date - Feb 02 , 2025 | 11:40 PM

ఓ కారు లారీని ఓవర్‌టెక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోలెరోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

రెండు వాహనాలు ఢీ.. ఆరుగురికి గాయాలు
ప్రమాదానికి గురైన కార్లు

పరిగి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఓ కారు లారీని ఓవర్‌టెక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోలెరోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని రూఫ్‌ఖాన్‌పేట్‌ శివారులో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఉప్పల్‌కు చెందినవారిగా గుర్తించారు. కొడంగల్‌లో పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 02 , 2025 | 11:40 PM