Home » Telangana » Rangareddy
సంక్రాంతి పండుగ తర్వాత హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
గ్రామాల్లో పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవానికి గ్రామ పంచాయతీలు సిద్ధమవుతున్నాయి.
ఇళ్ల ముందు నిలిపిన ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురైన ఘటన హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊట్లపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
అర్హత లేకున్నా పెంపుడు పిల్లికి వచ్చీరాని చికిత్స చేశారు. దాంతో వైద్యం వికటించి ఆ పిల్లి మృతిచెందింది. ఈమేరకు సరైన వైద్యం చేయని ప్రభుత్వ పశువైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పిల్లిని పెంచుకున్న మహిళ పోలీ్‌సలకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చేవెళ్లలో చోటుచేసుకుంది.
మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో వారం క్రితం అదృశ్యమైన వృద్ధుడు కందాడ కృష్ణయ్య(62) బావిలో పడి మృతిచెందినట్లు సీఐ నరహరి తెలిపారు.
వ్యక్తి అదృశ్యమైన ఘటన శంషాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు..జ మండల పరిధి పెద్దగోల్కొండకు చెందిన దూడల సాయిలుగౌడ్(55) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 3న మద్యం సేవించి ఇంటికొచ్చాడు.
కుటుంబ కలహాలతో భర్తను భార్య చంపిన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్ రెడ్డి కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన అంకుల షణ్ముఖరావు(51), భార్య ఉమాపతితో కలిసి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ గ్రామంలో 6 నెలల నుంచి అద్దెకు ఉంటున్నాడు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగునీటిలో పరిమితికి మించి ఫ్లోరైడ్, రసాయన అవశేషాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర భూగర్భ జల మండలి(సీజీడబ్ల్యూబీ) తాజాగా విడుదల చేసిన వార్షిక భూగర్భజలాల నాణ్యత నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి
సమాచారం ఇవ్వకుండా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూ సర్వే పనులు ఎలా చేపడతారని రైతులు, వివిధ పార్టీల నాయకులు అధికారులను నిలదీశారు. ఇందుకోసం పోలీసులను ఎందుకు తీసుకొచ్చారని, దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కుంటారా అని మండిపడ్డారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధి రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్యకు గురైన కొంగర నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.