Share News

మద్యం దుకాణంలో చోరీ

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:19 AM

శంకర్‌పల్లిలోని మద్యం దుకాణంలో దొంగలుపడ్డారు. రూ.30వేల నగదు, రూ.10వేల విలువ గల మద్యాన్ని ఎత్తుకెళ్లారు. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి పట్టణంలోని సింగాపురం గేటు వద్ద వెస్టు సైడ్‌ అనే పేరుతో రఘునందన్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు.

మద్యం దుకాణంలో చోరీ

రూ.30వేలతో పాటు రూ.10వేల విలువైన మద్యం బాటిళ్ల అపహరణ

శంకర్‌పల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): శంకర్‌పల్లిలోని మద్యం దుకాణంలో దొంగలుపడ్డారు. రూ.30వేల నగదు, రూ.10వేల విలువ గల మద్యాన్ని ఎత్తుకెళ్లారు. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి పట్టణంలోని సింగాపురం గేటు వద్ద వెస్టు సైడ్‌ అనే పేరుతో రఘునందన్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం తాళం విరగొట్టబడి ఉండటం గమనించిన పని మనిషి యజమానికి సమాచారమిచ్చాడు. రాఘవేందర్‌ వెంటనే దుకాణానికి చేరుకున్నాడు. దుకాణంలో రూ.30వేల నగదుతో పాటుగా రూ.10వేల విలువ గల మద్యం పోయినట్లుగా పోలీసులకిచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 12:19 AM