Share News

పకడ్బందీగా దర్గా ఉత్సవాలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:17 AM

హజ్రత్‌ జహంగీర్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌ స్థానిక వక్ఫ్‌బోర్డు అధికారులకు సూచించారు. ఈనెల 16నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దర్గా పరిసరాలను డీసీపీ పరిశీలించారు.

పకడ్బందీగా దర్గా ఉత్సవాలు
జేపీ దర్గా పరిసరాలను పరిశీలిస్తున్న డీసీపీ రాజేష్‌

శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌

కొత్తూర్‌, జనవరి10 (ఆంధ్రజ్యోతి) : హజ్రత్‌ జహంగీర్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌ స్థానిక వక్ఫ్‌బోర్డు అధికారులకు సూచించారు. ఈనెల 16నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దర్గా పరిసరాలను డీసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీన గంధోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దర్గా ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూ పద్ధతిలో భక్తులకు దర్గా దర్శనం కల్పించాలన్నారు. పోలీసులు సూచించిన స్థలాల్లోనే వాహనాలు పార్కింగ్‌ చేసేలా చూడాలన్నారు. దర్గా పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మారావు, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, మురళీగౌడ్‌, దర్గా సూపరింటెండెంట్‌ సత్తార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:17 AM