Share News

ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పక పాటించాలి

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:21 AM

వాహనాలు డ్రైవ్‌ చేసేవారు ట్రాఫిక్‌ రూల్స్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, రూల్స్‌ తప్పక పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం తెలిపారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై చేవెళ్ల మండలంలోని ఆయా కంపెనీల వద్ద గురువారం డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పక పాటించాలి
శంకర్‌పల్లి : డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం

చేవెళ్ల/శంకర్‌పల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): వాహనాలు డ్రైవ్‌ చేసేవారు ట్రాఫిక్‌ రూల్స్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, రూల్స్‌ తప్పక పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం తెలిపారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై చేవెళ్ల మండలంలోని ఆయా కంపెనీల వద్ద గురువారం డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను తగ్గించిన వారు అవుతారని చెప్పారు. రోడ్డుదాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రిపుల్‌ రైడింగ్‌, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం, సిగ్నల్‌ పాటించకపోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఏఎస్సైలు చందర్‌ నాయక్‌, అశోక్‌, సిబ్బంది తదితరులున్నారు. అలాగే డ్రైవర్లు పరిమితమైన వేగంతో బస్సులు నడపాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పక పాటించాలని సీఐ వెంకటేశం తెలిపారు. దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ బస్సు డ్రైవర్లకు ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. మద్యం సేవించి ర్యాష్‌డ్రైవింగ్‌ చేయరాదని, డ్రైవర్లు అస్వస్థతకు గురైతే బస్సులు వెంటనే రోడ్డు పక్కన ఆపాలని సూచించారు. అన్ని పత్రాలను కలిగి ఉండాలని, సురక్షితమైన డ్రైవింగ్‌ ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎల్‌.ఎస్‌ గణేష్‌, రిజిస్ర్టార్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:21 AM