Home » Telangana » Rangareddy
ప్రతీ పేదవాడికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడలో గృహలక్ష్మి సర్వేను పరిశీలించారు. కాంగ్రె స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఇళ్ల మంజూరుకు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దని సూచించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం రాత్రి గడిసింగాపూర్ దగ్గర జరిగింది.
దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న దొంగను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కొనిరెడ్డి వంశీ(23) డ్రైవర్.
పార్శిల్ తీసుకెళ్లిన ఇడ్లీలో రబ్బరు ఉందని ఓ వ్యక్తి తాను రిపోర్టర్‌ను అంటూ రూ.20 వేలు డిమాండ్ చేసిన ఘటన గురువారం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఒక వ్యక్తి ఇడ్లీ పార్శిల్ తీసుకెళ్లాడు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి వర్తింజేసేలా ఉద్యోగులు, అధికారులు చొరవ తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి అన్నారు.
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను కేశంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
మండల పరిధిలోని ఇప్పలపల్లి చెరువు కట్టపై నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడ్తాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆర్డీవో కె.జగదీశ్వర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుధారాణి సూచించారు.
మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజ్రత్ జహంగీర్‌పీర్ దర్గాలో బుధవారం గుసూల్ ఏ షరీఫ్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.