Share News

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 19 , 2025 | 11:25 PM

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరిలిలా ఉన్నాయి.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

వికారాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరిలిలా ఉన్నాయి. మునిసిపల్‌ పరిధిలోని మద్గుల్‌ చిట్టంపల్లి గ్రామానికి చెందిన జితేందర్‌(32) తన వ్యవసాయ పొలం వద్ద శనివవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పశువుల షెడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వికారాబాద్‌ మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం జితేందర్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 19 , 2025 | 11:25 PM