Share News

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:59 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మర్పల్లి శివారులో చోటుచేసుకుంది.

 గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మర్పల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మర్పల్లి శివారులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బూచన్‌పల్లికి చెందిన శిలాపూరం శ్రీకాంత్‌(25) వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగించేవాడు. మర్పల్లి శివారులో శనివారం రాత్రి గుర్తుతెలియని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు శ్రీకాంత్‌ను 108 వాహనంలో మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Updated Date - Jan 18 , 2025 | 11:59 PM