పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:59 PM
పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు బొలెరోతో ఢీకొట్టి చంపేందుకు యత్నించిన ఘటన కొందుర్గు మండలం చిన్నఎల్కిచర్ల శివారులో శనివారం చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్సై కృష్ణయ్య, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

బొలెరోతో ఢీ.. ముగ్గురిపై కేసు నమోదు
చౌదరిగూడ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు బొలెరోతో ఢీకొట్టి చంపేందుకు యత్నించిన ఘటన కొందుర్గు మండలం చిన్నఎల్కిచర్ల శివారులో శనివారం చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్సై కృష్ణయ్య, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నఎల్కిచర్లకు చెందిన అల్లి గోపాల్(35) ఇంటి నుంచి బయటికి వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయాడు. చిన్న ఎల్కిచర్ల సర్కిల్ వద్దకు రాగానే పుల్లప్పగూడకు చెందిన విక్రం, లడ్డు, సురే్‌షలు బొలెరో వాహనంతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారు. ఈక్రమంలో బొలెరో గోపాల్ పైనుంచి పోవడంతో కుడి చెవికి, కాళ్లకు, నడుముకు బలమైన గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, తన భర్తను చంపేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోపాల్ భార్య మల్లేశ్వరి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య చెప్పారు.