భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగరంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 600 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.
భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న కేజీ గంజాయి లిక్విడ్ బయటపడింది.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అన్నదాతలు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో హరీశ్ మానసిక స్థితి సరిగా లేదన్నారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు.
దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ పార్టీ కాంగ్రెస్‌లో మనమంతా పని చేయటం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిందని ఉద్ఘాటించారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకు ట్రై సైకిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు.