న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.
విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం పెట్టాలని సూచించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
హిల్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని రామచందర్ రావు ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం పాల్గొననున్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగుల సమయమంతా రోడ్ల పాలవుతోంది. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.
హైదరాబాద్ నగర వాసులను చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి తీవ్రతతో జనం స్వెటర్లు, మంకీ క్యాపులు లేకుండా బయటకు రావడం లేదు.
రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున వరుస ప్రమాదాలు సంభవించాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఘటనలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా జరుగనున్నాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు..