Home » YS Sharmila
అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల తేల్చేశారు. కర్నూల్‌లోని ఉల్లి మార్కెట్‌ను షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి సందర్శించారు. పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్న రాజారెడ్డి..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు.
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయమని షర్మిల వ్యాఖ్యానించారు.
మహానేత YSR పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని షర్మిలా ప్రశ్నించారు. YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు.
Jagan: NCLTలో జగన్‌కు ఊరట లభించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. NCLT తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్, కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు.
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) అనుమతులు లేకుండానే వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇచ్చారు? కోర్సు కాలం పూర్తయితే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఏంటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.