YS Viveka Murder Case: సీబీఐపై షర్మిల షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:16 PM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు.
అమరావతి, ఆగస్టు 29: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు. వై నాట్? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం అని.. ఇంత వరకు న్యాయం జరుగలేదన్నారు. సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. జగన్ మోదీకి దత్తపుత్రుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మోదీ చేతిలో సీబీఐ కీలు బొమ్మ అని.. జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కారని అన్నారు.
జగన్ కోసం అవినాష్ రెడ్డిని కూడా కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నిజంగా సీబీఐ అనుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేదన్నారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి సంఘటనా స్థలంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని షర్మిల తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. న్యాయం ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారామె. సీబీఐ విచారణ సరిగా లేదంటూ సునీత చేసిన ఆరోపణల్లో నిజముందన్నారు.
Also Read:
జియో భవిష్యత్తుపై అంబానీ కీలక ప్రకటన
నాకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది : ఎమ్మెల్యే రాజా సింగ్
For More Andhra Pradesh News and Telugu News..