YS Raja Reddy In Politics: రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి?

ABN, Publish Date - Sep 08 , 2025 | 12:24 PM

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్న రాజారెడ్డి..

కర్నూలు: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తల్లి షర్మిలతోపాటు తనయుడు రాజారెడ్డి కర్నూలు పర్యటన చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

తల్లి షర్మిలతో పాటు ఉన్న రాజారెడ్డి తన అమ్మమ్మ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయలక్ష్మిని కలసి ఆశీర్వాదాలు తీసుకున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ ఊపందుకుంది.

Updated at - Sep 08 , 2025 | 12:27 PM