Home » YS Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. లోక్‌సభలో లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నపై కేంద్రం వివరించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో గొడ్డలి పార్టీ శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి, సైలెన్సర్లు తొలగించి బలప్రదర్శన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని ధ్వజమెత్తారు.
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తామని స్పష్టం చేశారు.
వైసీపీపై బోరుగడ్డ అనిల్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తాడేపల్లిలోని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ నిరసనకు దిగారు. భార్యతో కలిసి ఆందోళనకు దిగిన ఆయన.. జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం అమరావతి వేదికగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడారు.
నాడు బాబాయిని గొడ్డలిపోటుతో చంపేస్తే ‘గుండెపోటు’ అన్నారు. నిందితులు సొంతవాళ్లే అయినా చంద్రబాబుపై నిందలు వేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథలే! రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరిని బైకుతో ఢీకొట్టి చంపేసి, సాక్ష్యాలు తారుమారు చేశారు.
అమరావతి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా... జగన్ సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జగన్‌కు నచ్చవని విమర్శించారు.
మహిళల్ని అవమానించి, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
విజయవాడ ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబుపై ఆధారరహిత ఆరోపణలు ప్రచురించినట్లు పేర్కొంటూ సాక్షి దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్‌తో పాటు ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.