Home » Yemen
యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చిట్టచివరగా మిగిలి ఉన్న ఆశ 'బ్లడ్ మనీ' మాత్రమేనని తెలిపారు. అద్బుతం జరిగితే తప్ప జులై 16న ఆమెను మరణం నుంచి కాపాడలేమని విన్నవించారు.
యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
యెమెన్లో మరణ శిక్ష పడ్డ నిమిష ప్రియను కాపాడుకునేందుకు ఆమె కుటుంబం 1 మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ కింద ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ దిశగా యెమెన్ రాజధానిలో చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
యెమెన్‌లో కేరళ నర్సు మరణ శిక్ష నిలుపుదల కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మరణ శిక్ష అమలు నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఎర్ర సముద్రంపై కార్గో నౌక దాడికి సంబంధించిన వీడియోను యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు విడుదల చేశారు. టైటానిక్ షిప్‌ను తలపించే భారీ నౌక రెప్పపాటులో నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Indian Nurse Nimisha: 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా.. విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే, నిమిషా తరపు న్యాయవాది మధ్యలో దెబ్బ వేశాడు.
యెమెన్(Yemens)లో ఘోర విషాదం చోటుచోసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా(boat sinks) పడటంతో 49 మంది మృత్యువాత చెందగా, 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా వెళుతుండగా సోమవారం సాయంత్రం యెమెన్ దక్షిణ తీరంలో పడవ మునిగిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎర్రసముద్రంలో యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. గాజా - ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. యెమెన్ హౌతీలు ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్‌ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది.
Indian Nurse Sentenced To Death In Yemen: భారతీయ నర్సుకు యెమెన్ (Yemen) ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో కేరళ (Kerala) కు చెందిన నిమిషా ప్రియా (Nimisha Priya) అనే నర్సుకు ఆ దేశంలో మరణశిక్ష పడింది. 2017 నుంచి యెమెన్ జైలు శిక్ష అనుభవిస్తుంది. హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.