Share News

KC Venugopal: నిమిష ప్రియను కాపాడండి

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:40 AM

యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది.

KC Venugopal: నిమిష ప్రియను కాపాడండి

న్యూఢిల్లీ, జూలై 12: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. ఆమెను ఈనెల 16న ఉరితీయనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదే విషయపై సీపీఐ ఎంపీ సంతోష్‌ కుమార్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. నిమిషకు క్షమాభిక్ష లభించేలా కేంద్రం కృషి చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 13 , 2025 | 03:40 AM