Home » West Bengal
ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్ కానున్నట్లు సమాచారం.
తృణమూల్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ తనయుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తాజాగా మమతాబెనర్జీ, పలువురు ఇతర నేతలకు లీగల్ నోటీసు పంపారు.
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం గాలిస్తున్న పోలీసులు కాళీఘాట్‌లోని అభిషేక్ నివాసానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించినట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
టీఎంసీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీలంతా తమనే అసలైన టీఎంసీగా పరిగణించాలని కోరుతూ స్పీకర్‌ను కోరేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో, అసన్సోల్ టీఎమ్‌సీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
పశ్చిమబెంగాల్‌లో అధికారం కోల్పోయినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆమె రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి తొలగించాలని పశ్చిమబెంగాల్‌లోని అధికార బీజేపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె మధ్య సోషల్ వేదికగా మాటల యుద్ధం సాగింది. వివరాల్లోకెళితే...
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఒక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.