కాలేజీ రూమ్‌లో నోట్ల కట్టలు.. చెదలు పట్టిన స్థితిలో..
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:25 PM
కోల్‌కతాలోని ఓ కాలేజ్ యూనియన్ రూములో చెదలు పట్టిన నోట్ల కట్టలు వెలుగుచూశాయి. రెండు సూట్ కేసుల్లో దాచిన 100, 500 నోట్ల కట్టలను పనివారు గుర్తించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఓ కాలేజ్ యూనియన్ రూములో చెదలు పట్టిన నోట్ల కట్టలు వెలుగుచూశాయి. రెండు సూట్ కేసుల్లో దాచిన 100, 500 నోట్ల కట్టలను పనివారు గుర్తించారు. చెదలు పట్టిన ఆ డబ్బుల విలువ రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా. ఇంతకీ ఏం జరిగిందంటే.. వర్షాకాలం సమీపిస్తుండటంతో మున్సిపల్ అధికారులు సురేంద్రనాథ్ కాలేజీ యజమాన్యానికి ఓ సూచన చేశారు. వీలైనంత త్వరగా కాలేజీని శుభ్రం చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యజమాన్యం కాలేజీని శుభ్రం చేసే పనులు మొదలెట్టింది.
పనివారు కాలేజీని శుభ్రం చేస్తుండగా యూనియన్ రూములోని అల్మారాలో రెండు పెద్ద సూట్ కేసులు కనిపించాయి. పని వారు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రూము దగ్గరకు వచ్చిన కాలేజీ సిబ్బంది వాటిని తెరిచి చూడగా.. చెదలు పట్టిన రూ.100, 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. చెదలు కారణంగా నోట్ల కట్టలు చాలా దారుణంగా పాడై పోయి ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసు అధికారులు ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘చాలా వరకు నోట్లు పాడైపోయి ఉన్నాయి. పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది’ అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ మాట్లాడుతూ.. ‘తృణమూల్ కాంగ్రెస్ లీడర్స్ అవినీతికి పాల్పడ్డారు. ఎవ్వరికీ తెలియకుండా అంత పెద్ద మొత్తం డబ్బులు కాలేజీ యూనియన్ రూములోకి ఎలా వచ్చాయో దర్యాప్తు జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. డబ్బులు దొరికిన యూనియన్ రూములో అన్ని వసతులతో కూడిన సీక్రెట్ రూము బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు